ఆంధ్రప్రదేశ్ సీనియర్ తెలుగుదేశం నాయకుడు కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై తెలుగుదేశం పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని చెప్పాలి. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడై ఉండి రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్గా పనిచేసి ప్రభుత్వ ఆస్తులను తన సొంతానికి వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుదేశం పార్టీ నాయకులు ఆలోచించాలి అదే విధంగా కోడెల ఆధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన కూతురు కుమారుడు ప్రజలను ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశారో అది వారు పోలీసులకు చేసిన ఫిర్యాదులను చూస్తే తేటతెల్లమైంది . ఇవన్నీ తెలిసి కూడా తెలుగుదేశం నాయకులు జగన్ ప్రభుత్వం ఈ ఆత్మహత్యకు కారణం అంటూ ఆరోపణలు చేయడం ఎంతవరకు వాస్తవం వారు అర్థం చేసుకోవాలి .
కోడెల ఆత్మహత్యపై అనవసర రాద్ధాంతం