గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు ఈ రోజు కీసర ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముప్పై రోజుల కార్యక్రమం సమీక్ష సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు .ఇది కేవలం ముప్పై రోజుల ప్రణాళిక కాదని నిరంతరం కొనసాగుతుందని అన్నారు .ముప్పై రోజుల ప్రణాళిక కార్యక్రమంలో సర్పంచ్లు వార్డు సభ్యులు మరి ఎంపీటీసీలు చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు .ఇదే స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని మున్సిపాలిటీలో కూడా చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి పేర్కొన్నారు .అయితే కొన్ని గ్రామాల్లో తగినన్ని నిధులు లేకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేక పోతున్నా విషయం మా దృష్టికి వచ్చిందని వాటి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని మంత్రి చెప్పారు అనంతరం మండలంలోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామాలకు ర్యాంకులను ప్రకటించి వారికి బహుమతులు అందజేశారు మరియు శాలువాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ శరత్ చంద్రారెడ్డి సిఇఓ ఎంపిడిఒ జడ్పీటీసీలు ఎంపీటీసీలు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు
<no title>